భార్యను నరికి...ఆత్మహత్య చేసుకున్న భర్త

SMTV Desk 2019-05-05 16:47:09  husband kills his wife in vijayawada jakkampoodi colony

అమరావతి: విజయవాడలోని జక్కంపూడి కాలనీలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల ప్రకారం....నరసింహారావు(56), కృష్ణాకుమారి(47) గత 25 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఉన్న ఇద్దరు పిల్లలకు పెళ్లిలు జరిగాయి. హాయిగా సాగుపోతున్న వీళ్ల కాపులో రోజు గొడవలు జరిగేవి. వివాదం జరిగినప్పుడులా భార్యను భర్త చంపుతానని బెదిరించేవాడు. గత రెండు రోజుల క్రితం భార్యతో నరసింహారావు గొడవపెట్టుకున్నాడు. దీంతో భార్య ఇంటిని తన అక్కగారింటికి వెళ్లింది. భార్యకు భర్త ఫోన్ చేసి క్షమించాలని కోరడంతో పాటు ఇంటికి రమ్మని కబురుపంపాడు. నరసింహారావు ఇంటికి వచ్చేసరికి భార్య నిద్రలోకి జారుకుంది. గొడ్డలి తీసుకొని భార్య నుదిటిపై వేటు వేశాడు. దీంతో భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అనంతరం నరసింహా రావు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనయుడు జాఘవా తలుపులు కొట్టినా ఎంతకు తీయకపోవడంతో బలవంతంగా తలుపులను తెరిచి చూసేసరికి ఇద్దరు చనిపోయి ఉన్నారు. జాఘవా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.