తెలుగు రాష్ట్రాల వెబ్‌సైట్లు హ్యాక్: టిసిఎస్‌ కంపెనీకి జరిమానా

SMTV Desk 2019-05-05 16:41:31  telangana wbsites hacking, andhrapradesh websites hacking, tcs

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలలోని విద్యుత్‌ పంపిణీ సంస్థల(డిస్కం) వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే హ్యాక్‌ చేయకుండా ఆపలేకపోయినందుకు గాను టిసిఎస్‌ కంపెనీకి తెలుగు రాష్ట్రాల డిస్కంలు భారీ జరిమానా వేయాలని ఆలోచనలో ఉన్నాయి. తెలంగాణతో పాటు ,ఏపి డిస్కంల వెబ్‌సైట్లను టిసిఎస్‌ కంపెనీ నిర్వహిస్తుంది. నిర్వహణలో లోపాల వల్లనే హ్యాకర్లు చొరబడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాబిన్‌సన్‌ అనే పేరుతో గుర్త తెలియని వ్యక్తులు రాన్సమ్‌వేర్‌ వైరస్‌ను పంపి డిస్కంల వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసి నగదు డిమాండ్‌ చేశారు. వారు అడిగిన డబ్బు చెల్లింయకుండా టిసిఎస్‌, డిస్కం నిపుణులు మళ్లీ వెబ్‌సైట్ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 4 డిస్కంలకు సంబంధించిన డేటా మింట్‌ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ డిస్కం(టిఎస్‌ ఎస్పిడిసిఎల్‌) ప్రధాన కార్యాలయంలో ఉంది. ఈ డేటా కేంద్రం దెబ్బతింటే బ్యాకప్‌ డేటా కేంద్రం తిరుపతిలో ఉంది. సర్వర్‌ డేటా నిర్వహణ ఐటి విభాగం, టిసిఎస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. హ్యాకర్లు టిసిఎస్‌ ఏర్పాటు చేసిన ఫైర్‌వాల్‌ను ధ్వంసం చేఇస డిస్కంల అప్లికేషన్‌ణు హ్యాక్‌ చేశారు. వారు 50 మిలియన్‌ డాలర్లను బిట్‌ కాయిన్ల రూపంలో చెల్లించాలని తాజాగా డిమాండ్‌ చేశారు. అప్లికేషన్‌లో సమాచారం అంతా పోయినా మళ్లీ డిస్కం డేటా కేంద్రంలో నుంచి తీసుకుని వెబ్‌సైట్‌ పునరుద్ధరణకు నిపుణుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ దీని ద్వారా ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించే సౌకర్యం ఇంకా వినియోగదారులకు పునరుద్ధరణ కాలేదు. ఇది జరిగితేనే పనులన్నీ పూర్తయినట్లు భావించాలి.