మహేష్ తో రాజమౌళి ఇక ఫాన్స్ కి పండుగే

SMTV Desk 2019-05-05 15:57:41  Mahesh Rajamouli,

టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఎదురుచూసే క్రేజీ కాంబినేషన్ ఎస్.ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో తీసే సినిమా.. ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో రాజమౌళి సినిమాలు చేశాడు. మహేష్ తో సినిమా కొన్నాళ్ల క్రితమే అనుకున్నా అది సెట్స్ మీదకు వెళ్లలేదు. బాహుబలి సినిమాతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ అంటూ రాం చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు.

2020 జూలై 30 ఈ సినిమా రిలీజ్ అని ప్రకటించారు కూడా... అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ తోనే అని వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా మహర్షి ప్రమోషన్స్ లో మహేష్ కూడా చూచాయగా అదే మాట చెప్పాడు. మహర్షి రిలీజ్ తర్వాత అనీల్ రావిపుడితో సినిమా ఉంటుందని.. ఆ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ఉండొచ్చని హింట్ ఇచ్చాడు మహేష్. సుకుమార్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉందని కాకపోతే అది ఇప్పుడప్పుడే కాదని అన్నాడు సూపర్ స్టార్ మహేష్.