నంద్యాల పోలింగ్ లో ఊహించని ఘటన..

SMTV Desk 2017-08-23 11:09:37  NANDHYALA ELECTIONS, POLING OFFICER SRINIVAS REDDY, HERAT ATTACK

నంద్యాల, ఆగస్ట్ 23 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నంద్యాల ఉప ఎన్నికలలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో భాగంగా పూలూరులో పోలింగ్ అధికారిగా నియమించబడ్డ శ్రీనివాసరెడ్డికి అకస్మాత్తుగా గుండెపోటు సంభవించింది. ఎన్నికల విధుల్లో భాగంగా శ్రీనివాస రెడ్డి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న గంట తర్వాత ఉనట్టుండి కుప్పకూలిపోయారు. ఇది గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస రెడ్డికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అయితే తన స్థానంలో మరో పోలింగ్ అధికారిని నియమించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.