ఎన్నికల్లో ఓడిపోవాలని కేసీఆర్ కుట్రలు చేశారు

SMTV Desk 2019-05-04 18:45:24  ap cm chandrababu, ts cm kcr, tdp, trs

అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవాలని కెసిఆర్‌ కుట్రలకు పాల్పడ్డారని విమర్శంచారు. ఓటర్లు ఏపికి రాకుండా, టిడిపికి ఓటు వేయకుండా అనేక ప్రయత్నాలు చేశారని హైదరాబాదు నుంచి ఏపీకి వచ్చే బస్సులను సైతం రద్దు చేశారని మండిపడ్డారు. అయినా ఓటర్లు తమ సొంత వాహనాల్లో వచ్చి, పట్టుదలతో ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఎంతో మంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని అన్నారు. తెలంగాణ కంటే ఏపీ అనేక రంగాల్లో ముందుందని చెప్పారు. అధికారుల్లో చీలిక తెచ్చేందుకు కొందరు యత్నిస్తున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా పని చేయాలనేదే తన సంకల్పమని చెప్పారు.