అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఎల్ఈడీ టీవీలపై భారీ డిస్కౌంట్లు

SMTV Desk 2019-05-04 18:41:47  amazon, amazon summer sale, led tv, bpl led tv

ముంభై: ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్ నిర్వహించిన సమ్మర్ సేల్‌లో ప్రతీ వస్తువుపై ఊహించని డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ సేల్‌లో 32 అంగుళాల టీవీని చౌక ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ మే 7 వరకే అందుబాటులో ఉంటుంది. బీపీఎల్ కంపెనీకి చెందిన 32 అంగుళాల ఎల్ఈడీ హెచ్‌డీ రెడీ టీవీ కేవలం రూ.8,999కే అందుబాటులో ఉంది. ఈ టీవీ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులు 10 శాతం తక్షణ తగ్గింపు పొందొచ్చు. రూ.8,999లో టీవీ కొంటే మీకు రూ.899 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీకు టీవీ రూ.8,100కే వచ్చినట్లు అవుతుంది. ఈ ఆఫర్ కాకుండా ఎక్స్చేంజ్ రూపంలో రూ.3,540 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇక బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు, ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులు, కొన్ని డెబిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది.