చంద్రబాబు బ్రహ్మాండమైన స్వీప్‌తో గెలవబోతున్నారు: గోరంట్ల

SMTV Desk 2019-05-04 18:40:59  ap assembly elections, tdp, chandrababu, gorantla buchhaiah chowdary

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ జెండానే మళ్ళీ ఎగురుతుందని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోశ్యం చెప్పారు. ఈ రోజు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్‌ తీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ..టిడిపి గెలుపు వరదలో పార్టీలన్నీ గల్లంతవ్వడం ఖాయమన్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే ఇదో సునామీ అని తాను చెప్పానని గుర్తు చేశారు. టిడిపికి సానుకూల పరిస్థితులున్నాయని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సియం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. చంద్రబాబు బ్రహ్మాండమైన స్వీప్‌తో గెలవబోతున్నారని గోరంట్ల వ్యాఖ్యానించారు.