పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమీక్ష

SMTV Desk 2019-05-04 18:40:20  ap cm, chandrababu, tdp

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అమరావతిలో రాష్ట్రంలోని పోలింగ్ సరళిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని నాయకులతో మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్టులో సమీక్ష జరుపుతున్నారు. అయితే ఈనెల 22 వరకు రోజుకు 2 పార్లమెంటు స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కాగా పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి సుమారు 50 మంది ముఖ్యనాయకులు ఇందులో పాల్గొననున్నారు.ఆ నివేదికలపైనే చంద్రబాబు ప్రస్తుతం సమీక్షించనున్నారు. ఈ రోజు సాయంత్రం సీబీఎన్‌ ఆర్మీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.