నోకియా 4.2 రిలీజ్ డేట్ ఫిక్స్

SMTV Desk 2019-05-04 18:35:57  nokia, nokia 4.2

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా తన నూతన స్మార్ట్ ఫోన్ నోకియా 4.2ను దేశీ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. మే 7న కొత్త నోకియా 4.2 స్మార్ట్‌‌ఫోన్‌లో భార‌త మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్లడించ‌లేదు. అయితే ఈ ఫోన్ ధర రూ.13000 శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను పొందుపరిచారు. మే 14న అమెరికాలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ✦ 5.71 ఇంచ్ డిస్‌ప్లే.
✦ 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ .
✦ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 439 ప్రాసెస‌ర్‌ .
✦ 2/3 జీబీ ర్యామ్‌ .
✦ 16/32 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌.
✦ 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా .
✦ ఆండ్రాయిడ్ 9.0 పై .
✦ డ్యుయ‌ల్ సిమ్‌ .
✦ డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ .
✦ బ్లూటూత్ 4.2, .
✦ 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.