అనుమానాస్పద స్థితిలో వరల్డ్ హాట్ మోడల్‌ మృతి

SMTV Desk 2019-05-04 17:17:30  Wolrd Hot model,

మిస్ యూనివర్స్ ఉరుగ్వే, వరల్డ్ హాట్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. మెక్సికోలో నివాసం ఉంటున్న 31 ఏళ్ల ఫాతిమివ్ డేవిలా గత నెల 23న ఓ హోటెల్‌లో దిగింది. కాగా, గురువారం ఆ హోటల్‌లో బాత్‌ రూమ్‌లోని టబ్ లో ఆమె మృతిచెంది ఉండడాన్ని హోటల్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. మే 2వ తేదీన హోటల్‌ గదిలోని బాత్‌రూమ్‌లో ఫాతిమివ్ డేవిలా చనిపోయి ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అది కూడా బాలీవుడ్ నటి శ్రీ దేవి మరణించి ఉన్నట్టుగానే పడి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ఫాతిమివ్ డేవిలా ఆత్మహత్య చేసుకుందా..? ఎవ్వరైనా హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో కాలు జారి ప్రాణాలు కోల్పోయిందా? అనే విషయాలు పోలీసులు ద్రువీకరించాల్సి ఉంది.