సినిమాకు వెళ్ళినా భరించలేరా: వాసిరెడ్డి పద్మ

SMTV Desk 2019-05-04 17:04:25  vasireddy padma, ysrcp, ys jagan mohan reddy, chandrababu

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా గురువారం సాయంత్రం.. నటుడు మహేష్‌బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అవేంజర్స్ మూవీకి వెళ్లారు. జగన్ సినిమాకు వెళ్లడంపై ఆయన చంద్రబాబు దుయ్యబట్టారు. తుఫాన్‌ సమయంలో ప్రతిపక్ష నేత విదేశాలకు వెళ్తున్నారని, ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని జగన్ సినిమాకు వెళ్ళారేమో అని సెటైర్లు వేశారు. అంతేకాక జగన్ ఎప్పుడు రాష్ట్రంలో ఉన్నారని.. చంద్రబాబు విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ...మా జగన్ ఎం చేసినతప్పేనా కుటుంబసభ్యులతో జగన్ సినిమాకు వెళ్లినా భరించలేకుండా రాజకీయం చేస్తున్న ధీన స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు. చంద్రబాబు ఓటమి భయంతో ఈసీపై, ఈవీఎంలపై, జగన్ పై విమర్శలు చెస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాటలు చూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సిగ్గు పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ముందు నుంచీ పదవి పోతుందనే భయం ఉంటుందని, అందుకే తన తమ్ముడిని, ఎన్టీఆర్ కుటుంబంలోని వారిని ఎదగనీయకుండా చంద్రబాబు చూశారని ఆరోపించారు. చంద్రబబు పాలనలో ఐదుగురు సీఎస్ లుగా పనిచేస్తే ముగ్గురు ఆయనకు పంటి కింద రాయిలా మారారంటే చంద్రబాబు ఎటువంటి విధానాలను అవలంభించారో అర్థం చేసుకోవచ్చన్నారు.