సీఎంకు కేవిపి రామచంద్రరావు బహిరంగ లేఖ

SMTV Desk 2019-05-04 16:56:37  kvp ramachandrarao, ap cm chandrababu, congress, tdp

అమరావతి: కాంగ్రెస్‌ నేత కేవిపి రామచంద్రరావు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారికి ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబు వైఖరితో పోలవరం విషయంలో ఏపికి నష్టం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత స్వార్దం, రాజకీయ ప్రయోజనాల కోసం, బిజెపితో లాలూచిపడి ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని కేవిపి వ్యాఖ్యనించారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా సాధించలేకపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని పోలవరం విషయంలో ఏపిపై భారం పడటాన్ని అంగీకరించేదిలేదన్నారు.