నేపాల్ లో హై అలర్ట్‌

SMTV Desk 2019-05-04 16:10:41  fani, nellore fani tsunami, nepal

నేపాల్‌: తీవ్ర వాయుగుండగా మారిన ఫణి తుఫాను వల్ల నేపాల్ లో హై అలర్ట్‌ ప్రకటించింది. తుఫాన్‌ ఒడిశా సరిహద్దు దాటి నేపాల్‌ కు విస్తరించే అవకాశముండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. తూర్పు, మధ్య నేపాల్‌ ప్రాంతాల్లో తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపనుండడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మరోవైపు శనివారం సాయంత్రం వరకు హెలిక్యాప్టర్లను నిలిపివేయాలని నేపాల్‌ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హిమాలయ రిజీయన్‌ లో పర్యాటకులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని టూరిజం శాఖ తెలిపింది.