బుమ్రాను బౌలింగ్‌ చేయకు అని ముందే చెప్పేస్తా: యువీ

SMTV Desk 2019-05-04 15:36:05  jaspreet bumrah, mumbhai indians, yuvaraj singh, ipl 2019

ముంభై: ముంభై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీట్ బుమ్రాపై ఆ జట్టు ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెట్స్‌లో కూడా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవాలని అనుకోవట్లేదని ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే ముందుగానే అతని దగ్గరికి వెళ్లి నువ్వు నాకు బౌలింగ్‌ చేయకు అని కోరతానని యూవీ అన్నాడు. నెట్స్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ముంబయి ఆటగాళ్లు ఇబ్బందులు పడతారని యూవీ పేర్కొన్నాడు. అయితే ప్రపంచకప్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో యూవీ భారత క్రికెట్‌ జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ముగ్గురు బౌలర్లలో బుమ్రా కచ్చితంగా ఉంటాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌ ఆడే బౌలర్లలో బుమ్రానే ఫేవరెట్‌ బౌలర్‌. బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు బుమ్రా. అతను ఎంతో నిలకడగా రాణిస్తున్నాడని అన్నాడు. అతను బౌలింగ్‌ వేస్తుంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ గుండెల్లో భయం మొదలవుతుంది. పేస్‌ బౌలింగ్‌ బాగానే ఉన్న టీమిండియాను స్పిన్‌ కలవరపెడుతోంది అని యూవీ పేర్కొన్నాడు.