గ్రూప్ -2 పరీక్షలు వాయిదా వేయాలి : విజయసాయి రెడ్డి

SMTV Desk 2019-05-04 15:31:05  mp vijayasai reddy, tdp, ap group 2

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నిరహించేందుకు సిద్దమయిన గ్రూప్ -2 పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సర్కార్ కు డిమాండ్ చేశారు. ఒకపక్క ఎన్నికల కోడ్ అమలులో ఉండటం మరో పక్క ఫొని తుపాను బాధితుల కోసం సహాయక, పునరావాస చర్యలు సాగుతున్నాయి..అవేవి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.గ్రూప్ -2 పరీక్షల విషయంలో ప్రభుత్వం దేనికో హడావుడి పడుతున్నట్టు కనిపిస్తోందని విజయసాయి అనుమానం వ్యక్తం చేశారు. పరీక్షలు ఒక నెల రోజులు ఒపిక పడితే పోయేదేంటని విజయసారెడ్డి ప్రశ్నించారు.ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలి ట్విట్టర్ వేదికపై విజయసాయిరెడ్డి కోరారు.