ఉత్తరకొరియాలోని స్వల్ప శ్రేణి క్షిపణుల పరీక్షణ

SMTV Desk 2019-05-04 15:28:17  North Korean leader Kim Jong , north korea parliament elections

ఉత్తరకొరియా: ఉత్తరకొరియాలోని పలు స్వల్ప శ్రేణి క్షిపణులను నేడు ఆ ప్రభుత్వ అధికారులు పరీక్షించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ క్రమంలో హోడో దీవి నుండి మిస్సైళ్లను పరీక్షించారు. అలాగే 2017, నవంబర్‌లో జరిగిన ఖండాంతర క్షిపణి పరీక్ష తరువాత మళ్లీ ఇదే మొదటిసారి మిస్సైల్‌ను పరీక్షించారు. దీర్ఘ శ్రేణి మిస్సైళ్ల‌ను ప‌రీక్షించ‌బోమ‌ని గ‌తంలో నార్త్ కొరియా హామీ ఇచ్చింది. దానికి త‌గిన‌ట్లుగానే ఈసారి షార్ట్ రేంజ్ మిస్సైళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు సమాచారం.