కేంద్ర మంత్రి వల్లే రాజీనామా చేశా : పహ్లజ్ నిహ్లాని

SMTV Desk 2017-08-22 18:08:26  SENSOR BOARD, SMRITI IRANI, PAHLAJ NIHALANI, PRASUD JOSHI

ముంబై, ఆగస్ట్ 22 : ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్ సి) చీఫ్ పదవికి పహ్లజ్ నిహ్లాని రాజీనామా చేయగా ఆయన స్థానంలో రచయిత ప్రసూన్‌ జోషిని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రహ్లాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "కేంద్ర మంత్రి స్మృతి ఇరాని నన్ను ఒత్తిడికి గురి చేసారు. "ఇందు సర్కార్" సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో వివాదం మొదలు కాగా, స్మృతి ఇరాని నాకు ఫోన్ చేసి ఇలా ఎందుకు చేసావ్..? అంటూ ప్రశ్నించింది. దానికి నేను సినిమా ట్రైబ్యునల్ ను అనుసరిస్తున్నాను అని చెప్పడంతో ఆగ్రహించిన ఆమె బోర్డు నుంచి తనను తొలగించేలా చేశారంటూ" ఆరోపించారు. అసలు ఈ సినిమా గురించి తనకు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్ళు ఎదురయ్యాయని, అయిన తాను 70 కత్తిరింపులతో ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చానని వెల్లడించారు.