నెం.4లో ధోనీనే ఆడాలి: కృష్ణమాచారి

SMTV Desk 2019-05-04 12:34:28  icc world cup 2019, team india, krishnamachary srikanth, mahendra singh dhoni, ambati rayudu, vijaya shankar

న్యూఢిల్లీ: మే 30న ఇంగ్లాండ్ వేదికగా అప్రరంభం కానున్న ఐసిసి వరల్డ్ కప్ టోర్నీలో టీంఇండియా జట్టులో నెం.4 స్థానంకు అంబటి రాయుడు స్థానంలో విజయ్ శంకర్‌కి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగగా.. నెం.4 స్థానంలో ఆడే ఆటగాడి గురించి మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ నడించింది. కానీ.. ధోనీ రూపంలో నెం.4లో ఆడగలిగే క్రికెటర్ టీమ్‌లో ఉంటే ఈ అనవసర చర్చ ఎందుకంటూ తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం గురించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. చాలా అతిగా దానిపై అనవసర చర్చ నడిపారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే..? ధోనీ రూపంలో రెడీమేడ్‌గా నెం.4లో ఆడే ఆటగాడు టీమ్‌లో ఉన్నాడు. మరి ఎందుకు ఈ రచ్చ..? ధోనీ కంటే ఎవరైనా ఆ స్థానంలో ఇప్పుడు మెరుగ్గా ఆడగలరా..? కానీ.. వన్డేల్లో ధోనీని నెం.4లో టీమిండియా ఆడించడం లేదు. అలా ఎందుకు చేస్తున్నారో ఇప్పటికీ రహస్యమే. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాపై ధోనీ బాదిన హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు.. తాజా ఐపీఎల్ సీజన్‌లో సాధిస్తున్న పరుగులు.. అతనిలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాయి. అందుకే ప్రపంచకప్‌లో ధోనీనే నెం.4లో ఆడించండి’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించాడు.