విద్యార్థుల స్టార్టప్‌లకు ఐబీ హబ్స్ పాఠాలు

SMTV Desk 2019-05-04 12:33:10  it hubs, students startup companys

ప్రస్తుత కాలంలో ప్రతీ విద్యార్థి ఏదో ఒక కంపెనీలో చేరి ఒకరి కింద పనిచేసే కన్నా.. తామే సొంతంగా ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టి కంపెనీ స్థాపించాలనే ఆలోచనలో ఉంటున్నారు. అయితే వీరికి అనుగుణంగా వారి ఆలోచనలకు తగ్గట్టు పాఠాలు చెప్పేందుకు ఐబీ హబ్స్ అనే ఓ సంస్థ సిద్దం అయ్యింది. కొత్త ఆలోచనతో వస్తున్న గ్రాడ్యుయేట్లను ఒక దగ్గరకు చేరదీసి మెంటర్స్ గైడెన్స్, టెక్నికల్ నాలెడ్జ్ నేర్పిస్తూ, క్యాపిటలిస్టులతో సత్సంబంధాలు ఏర్పరుస్తోంది ఐబీ హబ్స్. స్టార్టప్ కంపెనీ స్థాపించాలనే ఆలోచనతో ఉన్న యువతకు ఐబీ హబ్స్ ఉచితంగా స్టార్టప్ పాఠాలు చెబుతోంది. నెల రోజులపాటు నిర్వహించే ఈ క్లాసుల్లో మార్కెటింగ్, టెక్నికల్, క్యాపిటల్ అంశాలతోపాటు విజయవంతమైన స్టార్టప్ కంపెనీల కేస్ స్టడీస్, మార్కెట్ స్టడీ మొదలైన విషయాలను చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు ఎడిషన్లు పూర్తిచేసిన ఐటీ హబ్ ఇప్పుడు మూడో ఎడిషన్‌కు సిద్ధమైంది. మే 12 నుంచి మూడో ఎడిషన్‌ను ప్రారంభిస్తోంది. కంపెనీని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో దగ్గర్నుంచి పెట్టుబడి పెట్టే వాళ్లను పరిచయం చేసే వరకు ఈ సంస్థ బాధ్యతగా తీసుకుంటోంది. అంతేకాదు స్టార్టప్‌కు ఒక నెల రోజులు పాటు ఉచితంగా ఆఫీస్ స్పేస్, హార్డ్‌వేర్ సదుపాయాలను (కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు) కల్పిస్తోంది. ఈ స్కూల్‌లోని విద్యార్థులకు కేవలం మెంటర్లే కాకుండా పూర్వ విద్యార్థులు కూడా ఎంతో సహాయపడుతున్నారు. హైదరాబాద్, లక్నోలో నిర్వహించిన ఐబీ హబ్స్ స్టార్టప్ స్కూల్ 2018 ఎడిషన్‌ క్లాసుల్లో 2017 విద్యార్థులు పాల్గొన్నారు. వారి అనుభవాలను జూనియర్లతో పంచుకున్నారు. ఐబీ హబ్స్ స్టార్టప్ స్కూల్ నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన చాలా స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు ఉన్నత శిఖరాలను అందుకుంటున్నాయి. నదులు, ప్రవాహాలలో మునిగిపోతున్నవారిని కాపాడటానికి, అద్భుతమైన ట్రాకింగ్ డివైజ్‌ను డెవలప్ చేసిన ‘బెస్టో బెల్ట్స్’ స్టార్టప్ కంపెనీ ప్రతిష్టాత్మక ‘ఎంఐటీ - ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూట్‌క్యాంప్ 2019’లో స్థానం సంపాదించింది. అలాగే, వ్యర్థాలను వేరుచేసే పరికరాలను తయారుచేసిన స్టార్టప్ కంపెనీ ‘ట్రాష్కాన్’ సైతం సీఐఐ ‘బెస్ట్ ఉమన్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ 2018’ అవార్డును గెలుచుకుంది. షెల్, రిలయన్స్, అదాని గ్రూప్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్లతో ఈ స్టార్టప్ ఒప్పందాలు చేసుకుంది.