కీలక మలుపు తిరిగిన తమిళ రాజకీయాలు..

SMTV Desk 2017-08-22 17:48:36  TAMIL POLITICS, PALANISWAMY, PANIRSELVAM, DINAKARAN,

చెన్నై, ఆగస్ట్ 22 : తమిళ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎప్పుడు ఎడ మొహం పెడ మొహంగా ఉండే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ప్రస్తుతం ఏకమై అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, దినకరన్ లను వెళ్ళగొట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో తమను పార్టీ నుంచి దూరం చేస్తే తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఇదివరకే హెచ్చరించిన దినకరన్ అనంత పని చేయనున్నాడు. తమ వర్గానికి చెందిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని గవర్నర్ ను కలిశాడు. "తాము పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదు. వెంటనే అధికార పక్షం బలాన్ని నిరూపించుకునేలా ఆదేశాలను జారీ చేయాలి" అంటూ కోరారు. ఇదే కాక రాజ్ భవన్ నుంచి బయటకు రాగానే క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. 19 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురిని కలుపుకొని మొత్తంగా 22 మంది ఎమ్మెల్యేలతో పాండిచ్చేరిలోని రిసార్ట్ కు తరలి వెళ్ళినట్లుగా తెలుస్తోంది.