పెరిగిన ఇంధన ధరలు

SMTV Desk 2019-05-04 12:26:34  Petrol, Deseal, Price, New delhi

న్యూఢిల్లీ: శనివారం దేశీయ ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోలు ధరలు 6 నుంచి 8 పైసల మేర, డీజిల్ ధరలు 5 నుంచి 9 పైసల మేర పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 6 పైసలు పెరిగి రూ.73.13 వద్ద, డీజిల్ ధర 5 పైసలు పెరిగి రూ.66.71కి చేరింది. ఇక వాణిజ్యరాజధాని ముంబయిలో లీటర్ పెట్రోలు ధర 7 పైసలు పెరిగి రూ.78.71 వద్ద, డీజిల్ ధర 9 పైసలు పెరిగి 69.86 వద్ద కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. పెట్రోలు ధర 8 పైసులు, డీజిల్ ధర 9 పైసల మేర పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర రూ.77.55 వద్ద, డీజిల్ ధర రూ.72.51 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోలు ధర రూ.76.90 వద్ద, డీజిల్ ధర రూ.71.53 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా ఇంధన ధరలు పుంజుకున్నాయి. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌పై 0.21 శాతం పెరిగి 61.94 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 0.14 శాతం పెరిగి బ్యారెల్ ధర 70.85 వద్ద కొనసాగుతోంది.