పామును మింగేందుకు ప్రయత్నించిన కప్ప.. వీడియో వైరల్!

SMTV Desk 2019-05-04 12:24:26  snake, frog, frog eats snake, animals fighting, viral video

సాధారణంగా కప్పలను పాములు మింగుతుంటాయి. కానీ రోటీన్ కు భిన్నంగా ఓ కప్ప ప్రవర్తించింది. తన దగ్గరకు వచ్చిన పామును గుటుక్కున నోట కరచుకుంది. అనంతరం దాన్ని మింగేందుకు ప్రయత్నించింది. అయితే పాము కనీసం 2 అడుగుల పొడవు ఉండటంతో మింగలేక, కక్కలేక ఇబ్బంది పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం రామన్నపేటలో చోటుచేసుకుంది. దీన్ని వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరూ చూసేయండి.