జగన్ - అమిత్ షా రహస్య సమావేశం; కండిషన్స్ పెట్టిన జగన్

SMTV Desk 2019-05-03 19:38:19  jagan, amit shah, bjp, parliament elections

జాతీయ స్థాయిలో గత ఎన్నికల్లో వచ్చిన బంపర్ మెజారిటీ బీజేపీకి వచ్చే అవకాశాలు కాస్తయిన కనిపించడం లేదు. కాకపోతే.. పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మాత్రం ఖాయం. అందుకే ఇప్పటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీల లెక్కలు వేసుకుంటోంది.

కలసివచ్చే పార్టీలను గుర్తించి ఆయా పార్టీల అధినేతలతో ముందుగానే చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఆయన జగన్‌తో ఇప్పటికే రహస్యంగా చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. జగన్ పార్టీకి కనీసం 15 నుంచి 20 సీట్లు వస్తాయని పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే.

అమిత్‌ షాతో చర్చల్లో జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. ప్రత్యేక హోదాతో పాటు మరిన్ని అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఆర్థిక లోటుతో ఉన్న ఏపీకి ఆర్థిక సాయం అందిస్తామన్న భరోసాపైనా జగన్ హామీ అడిగినట్టు తెలుస్తోంది.

ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికే మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ గతంలోనే కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఒకవేళ బీజేపీకి వైసీపీ మద్దతు కీలకమైతే.. ప్రత్యేక హోదా సాధన మరింత సులభమవుతుంది. పనిలో పనిగా కేంద్రంలో కేబినెట్ పదవులు కూడా రాబట్టుకోవచ్చు.