గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ కు షాక్

SMTV Desk 2019-05-03 18:23:41  anil baj pai, aap, bjp, kejriwal, vijay goel

14 మంది ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న కేంద్ర మంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ మండిపడిన సంగతి తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను కొనడం అంత సులభం కాదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ కు ఎమ్మెల్యే అనిల్ బాజ్ పేయి షాక్ ఇచ్చారు. విజయ్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

ఢిల్లీలోని గాంధీనగర్ నియోజకవర్గానికి అనిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మే 12న ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ ఘటన ఆప్ కు ఇబ్బంది కలిగించేదే. మరోవైపు ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, పార్టీ మారేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ. 10 కోట్లను ఆఫర్ చేస్తోందని ఆరోపించారు.