ప్రభాస్ సాహో లేటెస్ట్ అప్ డేట్ ...

SMTV Desk 2019-05-03 18:10:10  prabhas, saaho

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో అంతర్జాతీయ స్థాయి నటుడిగా మారిపోయిన సంగతి తెలిసిందే . బాహుబలితో వచ్చిన ఇమేజ్ ను నిలుపుకోవడానికి ప్రభాస్ సాహోతో క్రేజీగా శ్రమిస్తున్నాడు. సాహో సినిమా ద్వారా తన స్టార్ డమ్ ను నిరూపించుకోవాలని అనుకుంటున్నారు ప్రభాస్. అందుకోసం గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం కఠోరంగా పనిచేస్తున్నాడు.

అయితే నిన్నటితో సాహోలో తన పార్ట్ షూటింగ్ పూర్తయింది. మిగతా షూటింగ్ త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తారని ఒక బజ్ నడుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా అన్ని పూర్తి చేసుకొని సాహో ఆగస్టు 15 వతేదీన సినిమా రిలీజ్ కానుంది.