మే 10 నుంచి ‘దోస్త్’కు దరఖాస్తులు

SMTV Desk 2019-05-03 17:12:46  Dosth , Telangana Dosth, Application

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఆన్ లైన్ దోస్త్ ఈనెల 10 నుంచి మొదలవుతోంది. ఈనెల 9న డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ - తెలంగాణ (దోస్త్) కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు కన్వీనర్ ప్రొ.ఆర్ లింబాద్రి. 10 నుంచి విద్యార్థులు ఆన్ లైన్ లో తమకు ఇష్టమైన కాలేజీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి రాష్ట్రంలో 76 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సహాయ కేంద్రాల నుంచి కూడా అప్లయ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా మీసేవ, ఆధార్ తో అనుసంధానం కలిగిన మొబైల్ నెంబర్ నుంచి కూడా దోస్త్ కి అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. కిందటేడాది ఒక్క మొబైల్ నుంచే 98 వేల మంది అప్లయ్ చేసుకున్నట్టు ప్రొ.లింబాద్రి వెల్లడించారు. పాత 10 జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికైనా ఆన్ లైన్ లో ఇబ్బందులు ఉంటే అక్కడే పరిష్కరిస్తారు. ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చాక అందులో పాసైన వారికి ప్రత్యేకంగా అప్పుడు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తారు