అంత మాత్రానికే చీప్ గా చూస్తారా?

SMTV Desk 2019-05-03 17:08:39  asha saini,

తన అందం తో అభినయం తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న ఆశా సైనీ సంచలన వ్యాఖ్యలు చేసారు ... "నటి అన్న తరువాత రకరకాల పాత్రలను చేస్తూ .. మా ప్రతిభను నిరూపించుకోవలసి ఉంటుంది. పాత్ర డిమాండ్ ను బట్టి కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేయవలసి ఉంటుంది. అంత మాత్రానికే చీప్ గా చూస్తారా? నన్ను బోల్డ్ హీరోయిన్ అన్నంత తేలికగా, నాతో కలిసి శృంగార సన్నివేశాల్లో నటించే హీరోలను బోల్డ్ యాక్టర్ అని పిలిచే దమ్ముందా?" అంటూ ప్రశ్నించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు .. పెద్దలకు మాత్రమే అనబడే షార్ట్ ఫిల్మ్స్ లో బోల్డ్ సీన్స్ చేస్తుంది .గతం లో ఈ భామ నువ్వు నాకు నచ్చావ్ .. నరసింహనాయుడు లో చేసి సందడి చేసింది ... లక్స్ పాప డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది . తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో ఆశా సైనీ .. తన పేరును ఫ్లోరా సైనీగా మార్చుకుని బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ప్రధానంగా హిందీ సినిమాలపైనే దృష్టిపెడుతూ .. తమిళ - కన్నడ సినిమాలను కూడా చేస్తూ వెళుతోంది.