నిర్మాత అలా అనడంతో రవితేజకి కోపం వచ్చిందట!!

SMTV Desk 2019-05-03 16:17:53  raja the great, disco raja, ravi teja, payal rajput

వరుస పరాజయాల తరువాత రవితేజకి రాజా ది గ్రేట్ తో హిట్ దక్కింది. హమ్మయ్య అని అభిమానులు అనుకుంటే, ఆ తరువాత నుంచి పరాజయాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే సైన్స్ ఫిక్షన్ చేస్తున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగు ఈ పాటికే మొదలు కావలసి ఉంది. కానీ ఇంతవరకూ అందుకు సంబంధించిన సందడి ఎక్కడా కనిపించడం లేదు. నిర్మాతకీ .. రవితేజకి మధ్య తలెత్తిన విభేదాలే అందుకు కారణమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఈ సినిమా బడ్జెట్ ను 40 కోట్ల నుంచి 30 కోట్లకి కుదించడం .. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన కొన్ని సీన్స్ లేపేయమని ఆయన పట్టుబట్టడం రవితేజకి కోపం తెప్పించాయని అంటున్నారు. ఈ కారణంగానే షూటింగు ఆగిపోయిందని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.