15 రోజులకు పూజా హెగ్డే పారితోషికం 2 కోట్లు!

SMTV Desk 2019-05-03 16:11:22  mahasrhi, pooja hegde, valmiki, harish shankar, duvvada jagannadham

ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ మాదిరిగానే పూజా హెగ్డే కూడా ఒక్కసారిగా వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత విడుదల కాగా, మహేశ్ బాబుతో చేసిన మహర్షి విడుదలకి ముస్తాబవుతోంది. ఇక ప్రభాస్ తో చేస్తోన్న సినిమా సెట్స్ పై వుంది. ఇలా ఒక్కసారిగా పూజా హెగ్డే రేంజ్ పెరిగిపోవడంతో ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందట. పూజా చెప్పిన పారితోషకం హరీశ్ శంకర్ కళ్లు తిరిగేలా చేసిందని టాక్.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి రూపొందుతోంది. వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం మొదట ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావించారు. కానీ పూజా హెగ్డే అయితే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని భావించి, ఆమెను సంప్రదించారు. 15 రోజులు కేటాయిస్తే చాలని చెప్పారట. అందుకు ఆమె 2 కోట్లు పారితోషికంగా అడిగిందని సమాచారం. దువ్వాడ జగన్నాథం సినిమాకి 75 లక్షలు తీసుకున్న పూజా, ఇప్పుడు 2 కోట్లు అడగడంతో ఆ షాక్ నుంచి హరీశ్ ఇంకా తేరుకోలేదని చెప్పుకుంటున్నారు.