ఈసీకి చంద్రబాబు లేఖ....అనుకూల స్పందన

SMTV Desk 2019-05-03 13:34:18  chandrababu, central election commission, chandrababu wright a letter cec

అమారావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫణి తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లేఖపై ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలో ఎన్నికల కోడ్‌ను మినహయించింది. ఆయన లేఖకు సానుకూలంగా స్పందించిన ఈసీ ఈ మేరకు నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను మినహాయించింది. వాటిలో విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయి. దీనిపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.