చంద్ర‌బాబు, లోకేశ్ పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

SMTV Desk 2017-08-22 16:20:13  Social Media, AP Chief Minister, Chandrababu naidu, MInister Nara Lokesh, Bala Krishna

చిత్తూర్, ఆగస్ట్ 22: సామాజిక మాధ్యమం వేదికగా చాలా మంది చాలా రకాలుగా సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంచలనాలలో సమాజానికి ఉపయోగపడేవి కొన్ని ఉంటే సమాజానికి నిరుపయోగమైనవి, సమస్యలు తెచ్చిపెట్టేవి చాలా ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కలిగనూరు గ్రామానికి చెందిన బసవరాజు (30) అనే వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పై అనుచిత పోస్టులు చేయడం సంచలనం రేకెత్తించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... నిందితుడు ఫేస్‌బుక్‌లో వైఎస్ఆర్‌సీపీ అన్అఫీషియల్ అనే పేజ్‌ని సృష్టించి చంద్ర‌బాబు, లోకేశ్ పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెడుతున్నాడని, వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి మహిళలు కొడుతున్నట్లు పోస్టులు చేస్తున్నాడని అన్నారు. వారితో పాటు ఎమ్మెల్యే, సినీన‌టుడు బాలకృష్ణపై కూడా ఆయ‌న అభ్యంతరకర ఫొటోలు పోస్ట్ చేశాడని తెలిపారు.