రాహుల్ గాంధీపై గెలుస్తాను

SMTV Desk 2019-05-03 11:32:11  Smiti Irani, BJP, Rahul Gandhi,

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై అమేథీలో తన విజయం తథ్యం అన్నారు కేంద్ర మంత్రి,బీజేపీ నేత స్మృతి ఇరానీ. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోబోతుందని తెలిసినా యుద్ధం చేస్తుంది. నేను తప్పకుండా రాహుల్ గాంధీపై గెలుస్తాను. నా గెలుపు అమేథీ ప్రజల గెలుపుగా నిలుస్తుంది. ఈ నియోజక వర్గంలో బీఎస్పీ-ఎస్పీ కూడా రాహుల్‌కి మద్దతు తెలుపుతున్నప్పటికీ తాము మాత్రం గట్టిపోటీనిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని రెండు స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు కోరడం చరిత్రలో ఇదే తొలిసారి. అమేథీ స్థానంలో రాహుల్‌ గెలుపు సాధ్యం కాదనే ఈ పని చేస్తున్నారు అంటూ స్మృతి తెలిపారు. . అయితే రాహుల్ అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది అమేథీ ప్రజలకు, ఈ నియోజక వర్గానికి రాని రాహుల్‌కి మధ్య జరుగుతున్న పోరని.. ఆయన ఐదేళ్లుగా అమేథీకి రాలేదని ఆమె స్పష్టం చేశారు.