ముంబై

SMTV Desk 2019-05-03 10:16:51  Mumbai, Sun risers Hyderabad,

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ సూపర్ ఓవర్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై సూపర్ విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో హైదరాబాద్‌ జట్టు 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ 3 బంతుల్లోనే మ్యాచ్‌ లిచింది. ఓపెనర్లుగా వచ్చిన హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌ స్వల్ఫ లక్ష్యాన్ని 3 బంతుల్లోనే ముగించారు. దీంతో ముంబయి ప్లే ఆఫ్‌కు చేరుకుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో ముంబయి, హైదరాబాద్ జట్టుకు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(24), సూర్యకుమార్ యాదవ్(23), మరో ఓపెనర్ డికాక్(69) అజేయ అర్థశతకంతో ముంబయి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ టై అయ్యింది. హైదరాబాద్‌ జట్టులో మనీష్‌ పాండే(71 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్‌ నబీ(31) రాణించాడు. ముంబయి బౌలర్లలో బుమ్రా, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా తలో 2 వికెట్లు తీశారు.