కొంచెం టైం ఇవ్వండి: తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్

SMTV Desk 2019-05-02 19:26:55  siddharth, bommarillu, gruham, south hero

హైదరాబాద్, మే 02: తెలుగు .. తమిళ భాషల్లో సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ వుంది. కెరియర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకున్న ఆయన, ఆ తరువాత అదే స్థాయిలో పరాజయాలను మూటగట్టుకున్నాడు. ఈ కారణంగా ఇక్కడ అవకాశాలు తగ్గడంతో, తమిళంలోనే తన సినిమాల జోరును కొనసాగిస్తున్నాడు. అలాంటి సిద్ధార్థ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు.

"ఎవరేమనుకున్నా నేను వచ్చేస్తున్నానులే. తెలుగు ప్రేక్షకులారా నా ప్రామిస్ ను గుర్తుపెట్టుకోండి .. మంచి కంటెంట్ ను సిద్ధం చేశాను .. నాకు 18 నెలల సమయం ఇవ్వండి .. మిమ్మల్ని అలరించడానికి 100% ప్రయత్నిస్తాను. నేను ఆన్ ది వే .. మాట్లాడుకుందాం" అంటూ ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ఓ తెలుగు సినిమా చేయనున్నాడనే విషయం మాత్రం ఆయన ట్వీట్ వలన అర్థమవుతోంది.