సిటీ బస్సులో కాల్పులు జరిపింది ఏపీ కానిస్టేబుల్‌!

SMTV Desk 2019-05-02 19:26:04  firings in hyderabad city buss, hyderabad, ap constable

హైదరాబాద్: ఈ రోజు హైదరాబాద్ లోని సిటీ బస్సులో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పులు జరిపింది ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ కానిస్టేబుల్‌ ఆర్‌.శ్రీనివాస్‌గా అధికారులు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారిస్తున్నారు. అతడు ఓ ప్రముఖుడి వద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్నట్టు సమాచారం. నిందితుడి నుంచి పూర్తి సమాచారం సేకరించాక అధికారికంగా మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో శ్రీనివాస్‌ పంజాగుట్ట సర్కిల్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఆ బస్సులోనే ఈ నిర్వాహకం అంతా జరిగింది.