'మహర్షి' రీమేక్ పై దృష్టిపెట్టిన తమిళ స్టార్ హీరో

SMTV Desk 2019-05-02 19:24:59  maharshi, vijay, ilayathalapathy, kollywood hero

హైదరాబాద్, మే 02: మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో నిర్మితమైన మహర్షి ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు కనిపించే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మహేశ్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్ పై తమిళ స్టార్ హీరో విజయ్ దృష్టిపెట్టినట్టుగా ఫిల్మ్ నగర్ లో పుకారు షికారు కొడుతుంది. గతంలో తెలుగులో మహేశ్ బాబు చేసిన పోకిరి .. ఒక్కడు సినిమాలు, తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమాలు ఆయనకి భారీ విజయాలను అందించాయి. దాంతో మహర్షి సినిమా రీమేక్ పై విజయ్ దృష్టిపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. మహర్షి ఫలితం ఎలా ఉంటుందో చూసుకుని విజయ్ రంగంలోకి దిగొచ్చని కోలీవుడ్ వర్గాల్లో ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.