"సై..రా నరసింహా రెడ్డి" లో నటించబోయేది వీరే

SMTV Desk 2017-08-22 14:46:13  uyallavada narsimha reddy, ram charan, chiranjeevi, 151 movie, sye ra narsimha reddy motional poste,

హైదరాబాద్, ఆగస్ట్ 22: ఖైదీ నం.150 చిత్రం తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం "సై..రా నరసింహా రెడ్డి" మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో ఓ కోటపై ఉన్న బ్రిటీష్ జెండా తగులబడుతున్న దృశ్యాన్ని జూమౌట్ చేస్తూ, కోట పరిసరాల్లో బ్రిటీష్ సైనికుల మృతదేహాలు కుప్పలుగా పడుండగా, చేతిలో విల్లు, ధనుర్భాణాలు, ఓ కత్తి ధరించిన చిరంజీవి, తన అనుచరులతో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న న‌య‌న‌తార నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్‌, సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, తమిళ నటుడు విజయ్ సేతుప‌తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.