జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు: యామిని

SMTV Desk 2019-05-02 17:37:28  ys jagan mohan reddy, ysrcp, yamini sadhineni, yamini sadhineni fires on jagan

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని గురువారం అమరావతిలో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో ప్రతిపక్షనాయకుడిగా జగన్ తన బాధ్యతను ఏనాడూ నెరవేర్చలేదని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. ఏ ఒక్క ప్రజా సమస్యపై స్పందించని జగన్.. పక్క రాష్ట్రంలో తెలుగు విద్యార్ధులు చనిపోతే స్పందించకుండా.. ఒక సైకో డైరెక్టర్ తీసిన సినిమా మీద ట్వీట్ చేయడం చూసి ప్రజలు అస్యహించుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఒక రాజకీయ ఉన్మాదిగా ప్రజలు అభివర్ణిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్ర రాష్ట్రానికి టూరిస్టులా మారారని ఎద్దేశా చేశారు యామిని. మే 23 తర్వాత తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన.. తన ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిందే అన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారని.. ఇక లోటస్ పాండ్‌నను తన పర్మినెంట్ నివాసం చేసుకోవచ్చన్నారు. తాడేపల్లిలోని తన ఇంటిని ఏదైనా ఐటి కంపెనీకి లీజుకిస్తే అద్దైనా వస్తుందన్నారు.ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సందర్శించలేదన్నారు యామిని. ఇలాంటి వారికి ప్రతిపక్ష హోదా కూడా అనవసరమని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ గత ఐదేళ్లలో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారు.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలపర్చుకునేందుకు దొడ్డిదారులు వెతుకుంటున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతను అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని పరిపాలించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.ఎన్నికల కోడ్ పేరుతో వృద్ధులు, వితంతువుల, వికలాంగులకు ఇచ్చే పించణ్లు సీఎస్ అడ్డుకోవడం దారుణమన్నారు యామిని. గత ఐదేళ్లలో సాటి ఐఏఎస్ అధికారులు, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ.. సీఎస్ ఇతర అధికారుల ముందు పలుచనవుతున్నారు. రానున్న తరాలకు స్పూర్తిగా ఉండాల్సిన అధికారి ఇలా వ్యవహరించడం సమంజసమా అంటూ ప్రశ్నించారు.