ఎన్నికలపై బెట్టింగులు: ముఠా అరెస్టు

SMTV Desk 2019-05-02 17:36:18  ap elections, bettings on ap eelctions guntoor

గుంటూరు: జిల్లాలో ఎన్నికలపై బెట్టింగులు నిర్వహిస్తున్న ఏడుగురు సభ్యులు గల ముఠాను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుండి రూ.10.15లక్షల నగదు, కారు, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఎపిలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 23న విడుదలకానున్నాయి. ఈ క్రమంలో ఎపిలో ఎవరు గెలుస్తారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ లు కాస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు అందిన సమాచారం మేరకు ఓ ఇంటిపై దాడి చేసి ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కాస్తున్న ఏడుగురిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్ పోలీసులు మీడియాకు తెలిపారు.