ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న ఎన్టీఆర్

SMTV Desk 2019-05-02 17:33:18  NTR, rrr,

బాహుబలి చిత్రాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్… ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టి స్టారర్ చిత్రం కొమురం భీం, అల్లూరి సీతా రామరాజు స్పూర్తిగా కల్పిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలనా కాలం 1920 బ్యాక్ డ్రాపుతో రూపొందుతున్న ఈ పీరియడ్ ఫిల్మ్‌లో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది. కానీ రామ్ చరణ్ కి తగిలిన గాయాల వలన ఈ షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడగా, తరువాత ఎన్టీఆర్ కూడా గాయం కారణంగా కొద్దీ రోజులు సెలవు తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం లో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ భామ అలియా భట్ ఖరారు కాగా, ఎన్టీఆర్ కోసం వెతికిన బ్రిటిష్ భామ కొన్ని కారణాల వలన తప్పుకోగా తన స్థానంలో నిత్యామీనన్ ని తీసుకున్నారని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఒక కొత్త వార్త ఇపుడు నెట్టింట్లో షికార్లు చేస్తుంది. ఎన్టీఆర్ సరసన నటించేది ఒక్క హీరోయిన్ కాదని, ఇద్దరు అనేది లేటెస్ట్ న్యూస్. కాగా ఈ న్యూస్ ఎంత వరకు నిజం అనేది అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.