యువకుడి ప్రాణాలు తీసిన బర్త్ డే బంప్స్...సెహ్వాగ్ సీరియస్ ట్వీట్

SMTV Desk 2019-05-02 17:32:13  student died due to birthday bumps

ఓ యువకుడి పుట్టినరోజు సందర్భంగా తన మిత్రులంతా కలిసి బర్త్ డే బంప్స్ అనే పేరుతో అతన్ని చితకబాదారు. అయితే అప్పటివరకు బాగానే ఉన్న యువకుడు ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ సంఘటనకు సంభంచిన వీడియో వైరల్ అయ్యింది. అది కాస్తా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కంటపడటంతో దానిపై సీరియస్ అయ్యి ఇలాంటి పుట్టినరోజు సంబరాలు అవసరమా.. అంటూ ట్వీట్ చేశాడు. తన అధికారిక ఖాతా ద్వారా ట్వీట్ చేసిన వీరూ.. ఇది చాలా బాధాకరం. స్టూడెంట్‍ను బర్తడ్ బంప్స్‌తో చనిపోవడానికి కారణమైయ్యారు. ఈ పద్ధతిలో సెలబ్రేట్ చేసుకోవద్దు. బాధ్యతాయుతంగా ఉండండి. బర్త్ డే బంప్స్ అలాంటివి పెట్టుకోకండి. ఇదెవరికి సరదాగా అనిపించదు అని వీరూ అభిప్రాయపడ్డాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంది. కొందరు సెహ్వాగ్‌కు మద్దతిస్తుంటే.. మరి కొందరేమో.. నిజంగా చనిపోయాడా అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.