ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

SMTV Desk 2019-05-02 17:30:01  airtel, amazon prime, airtel prepaid customers

ఎయిర్‌టెల్ కంపెనీ తన ప్రిపెయిడ్ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రిపెయిడ్ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ సేవలను ఉచితంగా అందిస్తోంది. కంపెనీ గతంలో కేవలం పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ సేవలు అందించేది. యూజర్లు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా పొందాలంటే రూ.299 ప్లాన్‌తో మొబైల్ నెంబర్‌ రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. అంటే మీరు నెలకు రూ.299 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే అమెజన్ ప్రైమ్ సేవలు ఉచితంగా పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో సినిమాలు, టీవీ సిరీస్, ప్రైమ్ ఒరిజినల్స్ వంటి వాటిని వీక్షించొచ్చు. రూ.299 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ప్రొడక్టులను ఫాస్ట్ డెలివరీ పొందొచ్చ. ఎక్స్‌క్లూజివ్ డీల్స్ ముందుగానే చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ రీడింగ్ ద్వారా ఇ-బుక్స్ చదవొచ్చు. ఇకపోతే రూ.299 ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ప్రతి నెల రూ.299తో రీచార్జ్ చేసుకుంటే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా పొందుతూనే ఉండొచ్చు. రూ.299 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే మీకు కంపెనీ ఒక లింక్ వస్తుంది. దీని ద్వారా ఎయిర్‌టెల్‌థాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తద్వారా అమెజాన్ ప్రైమ్ సేవలు పొందొచ్చు.