ఏపీకి అండగా ఒడిశా

SMTV Desk 2019-05-02 16:17:48  andhrapradesh, odissa, odissa cm naveen patnaik, ap cm chandrababu, fani tsunami

అమరావతి: తీరం దాటుతున్న ఫణి తుఫానుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సచివాలయలో తన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లతో సీఎం అత్యవసర సమీక్ష జరిపారు. ఫొని తుపాను రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఒడిశాలోని పూరీని తాకవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు ఇచ్చిన అంచనాలపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సిఎం చంద్రబాబు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఒడిశా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నవీన్‌కు చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.