ఫణి తుఫాన్ : వర్షాలు స్టార్ట్

SMTV Desk 2019-05-02 15:40:08  fani, nellore fani tsunami, srikakulam

శ్రీకాకుళం: తుఫానుగా మారిన వాయుగుండం ఫణి తీరం దాటుతున్న నేపథ్యంలో పలాస, టెక్కలి, సంతబొమ్మాళి, శ్రీకాకుళంలో వర్షం మొదలైంది. మిగిలిన సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఇచ్ఛాపురం సహా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని మొత్తం 103 రైళ్లను అధికారులు రద్దు చేశారు. తుపాను పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని కలెక్టర్ నివాస్ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర మండలాల్లో పరిస్థితులు మారుతున్నాయి.