ఐపిఎల్‌లో ధోని రికార్డ్

SMTV Desk 2019-05-02 15:29:19  mahendra singh dhoni, ipl , chennai super kings

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డును సమం చేశాడు. తాజాగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ధోనికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. దీంతో ఐపిఎల్‌ చరిత్రలో ధోని ఖాతాలో 17వ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు చేరింది. 17 మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులతో టీమిండియా వైఎస్‌ కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు. ఐపిఎల్‌ చరిత్రలో భారత్‌ నుంచి వీరిద్దరు మాత్రమే అత్యధికంగా అవార్డులను గెలిచారు.