మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు: అల్లు అర్జున్

SMTV Desk 2019-05-02 13:56:26  stylish star, allu arjun, allu arvind, allu family

హైదరాబాద్, మే 02: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడనీ .. ప్రస్తుతానికి సినిమాలపైనే పూర్తి దృష్టిపెట్టమని అల్లు అరవింద్ చెప్పిన అల్లు అర్జున్ పట్టించుకోవడం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తుంది. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ కారణంగానే అల్లు అర్జున్ .. వేరే బ్యానర్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాడనే టాక్ కూడా వచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను నా భార్యా బిడ్డలతో కలిసి మా అమ్మానాన్నలతోనే ఉంటున్నాను. ప్రతిరోజు మా నాన్న .. నేను కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటాము. మా మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టుగా వచ్చిన పుకార్లను విని మేము నవ్వుకున్నాము. మా నాన్నకి .. నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము" అని చెప్పుకొచ్చాడు బన్ని.