'96' రీమేక్ గా '99' రిలీజ్ .. తొలి రోజునే హిట్ టాక్

SMTV Desk 2019-05-02 13:55:33  96, trisha, vijay sethupathi, ganesh, bhavana

బెంగళూరు, మే 02: ఏడాది క్రితం తమిళంలో భారీ విజయాలను సాధించిన చిత్రాల జాబితాలో 96 ముందువరుసలో కనిపిస్తుంది. వైవిధ్యభరితమైన సినిమాగా ఇది విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించిన ఈ సినిమాను, కన్నడలో 99 పేరుతో తెరకెక్కించారు. ప్రీతమ్ గబ్బి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, గణేశ్ - భావన జంటగా నటించారు.

నిన్న విడుదలైన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీకి కన్నడ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. తొలిరోజునే ఈ సినిమా అక్కడ హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక తెలుగులోను 96 మూవీని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ - సమంత ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ పూర్తయింది. ఇక్కడ కూడా ఈ కథ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో తెలియాలంటే సినిమా రిలీజ్ దాక ఆగాల్సిందే.