చిరు 151వ చిత్రం టైటిల్ ఖరారు...

SMTV Desk 2017-08-22 13:54:34  uyallavada narsimha reddy, ram charan, chiranjeevi, 151 movie, sye ra narsimha reddy

హైదరాబాద్, ఆగస్ట్ 22: కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న చిరంజీవి 151వ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు వివిధ భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రానికి "సై..రా నరసింహ రెడ్డి " అనే టైటిల్ ని ఖరారు చేసినట్లుగా సమాచారం. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.