కూలిన చార్మినార్‌ స్థంభం!

SMTV Desk 2019-05-02 13:52:51  hyderabad charminar dammage

హైదరాబాద్: హైదరాబాద్ చారిత్రిక కట్టడం చార్మినార్‌లోని ఓ భాగం కుప్పకూలింది. బుధవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో పురావస్తు శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చార్మినార్‌కు ఉన్న మీనార్‌పై ఉన్న సున్నపురాయి కట్టడంలోని చిన్న ముక్క ఉన్నట్టుండి కూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కూలిన మినార్ భాగాన్ని అధికారులు భద్రపర్చారు. పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు వచ్చి చార్మినార్‌ను పరిశీలిస్తున్నారు.