హైదరాబాద్ : సిటీ బస్సులో కాల్పులు

SMTV Desk 2019-05-02 13:51:48  firings in hyderabad city buss, hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు జరిగాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారి మధ్య ఘర్షణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బులెట్ బస్సు రూఫ్ నుంచి బయటికి వెళ్లి పోయింది. పంజాగుట్టలోని శ్మశానవాటిక వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మణికొండ వైపు వెళుతోన్న 47(ఎల్) సర్వీస్ బస్సులో ఈ కాల్పుల బీభత్సం జరిగింది. ఏపీ 28 జెడ్ 4468 బస్సు నంబర్. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.